ప్రభుత్వ అనుమతి లేని ప్లాట్లను ప్రజలు కొనొద్దు మంచిర్యాల జిల్లా సంయుక్త కలెక్టర్ మధుసూదన్

Published: Tuesday December 27, 2022
బెల్లంపల్లి డిసెంబర్ 26 ప్రజా పాలన ప్రతినిధి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి, తాండూరు, మండలాలలో అధికారుల అనుమతి లేకుండా నిబంధనలకు వ్యతిరేకంగా ప్లాట్లుగా చేసి అమ్ముతున్న స్థలాల్లో ప్లాట్లు అమ్మకూడదు, కొనేవారు కొనకూడదనీ ,  అధికారులు వెంచర్లలో వేసిన బి టి రోడ్లను ట్రాక్టర్లతో శనివారం తొలగించారు.
 
వివరాల్లోకి వెళ్తే
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పంచాయితీ పరిధిలోని తిరుమల హిల్స్ , దాన్ని ఆనుకొని కొత్తగా   వెలసిన కొత్త వెంచర్ల లో ప్రజలు ప్లాట్లను కొనకూడదని, అమ్మకూడదని, జిల్లా సంయుక్త కలెక్టర్ మధుసూదన్ నాయక్, బెల్లంపల్లి  తాసిల్దార్ కుమారస్వామి, పంచాయితీ రాజ్ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శనివారం ఆయా స్థలాలను అధికారులు పరిశీలించారు,
తిరుమల వెంచర్స్ మరియు నూతనంగా వెలుస్తున్న  వెంచర్లకు, ప్రభుత్వ అనుమతి లేదని, ప్రభుత్వ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ప్లాట్లుగా చేసి అమ్ముతున్నారని, స్థలాలను ఎవరు అమ్మకూడదనీ, కొనకూడదనీ,  ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 
వెంచర్లుగా ఏర్పాటు చేసిన స్థలాలు ప్రభుత్వ స్థలాలుగా గుర్తించామని, ప్రభుత్వ అధికారులు తిరిగి పరిశీలన జరిపి నివేదిక ఇచ్చేవరకు, ఎలాంటి లావాదేవీలు జరుపకూడదని వారిని హెచ్చరించినట్లు తెలిసింది.
ఈ మధ్య కాలంలో తాండూర్ మండలంలో ప్రభుత్వ భూముల్లో వేసిన పిట్ట గుడిసెలను  కూడా తోలగించామని వారు తెలిపారు.