ఘనంగా కాంగ్రెస్ పార్టీ బూర్గంపాడు మండల ప్రధాన కార్యదర్శి చల్ల వెంకట నారాయణ జన్మదిన వేడుకలు

Published: Wednesday January 11, 2023

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, పినపాక నియోజకవర్గం నాయకులు  చల్లా వెంకటనారాయణ  జన్మదినం సందర్భంగా డీసీసీ అధ్యక్షులు, భద్రాచలం ఎమ్మెల్యే  శ్రీ పొదెం వీరయ్య   క్యాంపు కార్యాలయము నందు కేకు కట్ చేపించి శుభాకాంక్షలు తెలియజేసిన భద్రాచలం నియోజకవర్గం శాసనసభ్యులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు  పొదెం వీరయ్య . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలోపినపాక నియోజకవర్గ కోఆర్డినేటర్ కాటబోయిన నాగేశ్వరరావు, నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ బీరం సుధాకర్ రెడ్డి, మాజీ గ్రంధాలయ చైర్మన్ బోగల శ్రీనివాస రెడ్డి,జిల్లా మైనారిటీ చైర్మన్ మహిమూద్ ఖాన్, భద్రాచలం పట్టణ అధ్యక్షుడు సరేళ్ల నరేష్, చల్లా ఆర్మీ సిబ్బంది కౌలురి శ్రీకాంత్,దారా మణికంఠ, కౌలురి నాగేంద్ర బాబు, కోతమర్తి శివ, నాగశేషు, నండ్రు వరుణ్, నవీన్, మోదుగు గౌతమ్, కిరణ్ కుమార్,బోగపతి సచిన్ తదితరులు పాల్గొన్నారు.