మత్స్య కార్మికులపై ఎదురు తిరిగిన గ్రామస్తులు శంకరపట్నం జనవరి 19 ప్రజాపాలన రిపోర్టర్:

Published: Friday January 20, 2023
శంకరపట్నం మండలం కరీంపేట గ్రామంలోని గార్లకుంటలో ప్రభుత్వ జీవో ప్రకారం కేశవపట్నం మత్స్య కార్మిక సంఘానికి ఆ కుంటను ప్రభుత్వం కేటాయించగా గత  కొద్ది నెలలుగా చేపల పెంపకం చేపడుతూ మత్స్య కార్మికులు జీవనోపాధి కొనసాగిస్తున్నారు. కాగా గురువారం కరీంపేట గ్రామంలోని కొందరు గ్రామస్తులు అక్రమంగా చేపలు పడుతున్నారని తెలుసుకొని అక్కడికి చేరుకున్న కేశవపట్నం మత్స్య కార్మిక సంఘం  మత్స్య కార్మికులపై వాగ్వాదం జరిపి, మా ఊరి కుంటలోని చేపలు మేమే పట్టుకుంటామని ప్రభుత్వ ఉత్తర్వులతో మాకు పనిలేదని గ్రామస్తులు మత్స్యకారులపై వాగ్వాదానికి దిగగా, అక్కడినుండి మత్స్య కార్మికులు వెండిదిరిగారు. ఈ విషయంపై మత్స్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు కేశవపట్నం మత్స్య కార్మిక సంఘం గ్రామ అధ్యక్షుడు నూనె రవి తెలిపారు.