*తంగళ్లపల్లి గ్రామంలో ఘనంగా జరిగిన జాతీయ బాలికల దినోత్సవం*

Published: Wednesday January 25, 2023
*ప్రజాపాలన కొందుర్గు :కొందుర్గు మండల్ తంగెళ్లపల్లి గ్రామంలో అంగన్వాడీ అధ్వర్యంలో జాతీయ బాలికల దినోత్సవాల్లో ముఖ్య అతిధిగా విచ్చేసిన కొందుర్గ్ జడ్పీటిసీ తనయుఁడు రామకృష్ణ మాట్లడుతూ బాల్య దశ నుండే ఆడపిల్లలను అన్ని విషయాలలో ప్రోత్సహించి వారి బంగారు భవిశ్యత్తుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు తీసుకువచ్చింది 
ఆడపిల్ల పుడితే 13000 వేల రూపాయలు ఇస్తూ 
ఆ తల్లి పెద్దదైతే మేనమామ లాగా కల్యాణలక్ష్మి ఇస్తున్న ఏకాయక రాష్ట్రము తెలంగాణ .
షీ టీమ్స్ ఇలా అనేక కార్యక్రమలు చేస్తూ ఆడబిడ్డ హక్కులు , సంరక్షణ , అభివృద్ధి వైపు నడిపేలా కేసీఆర్ పథకాలు ఉన్నాయి 
ఆడపిల్లను రక్షిద్దాం , చదివిద్దాం ఎదగనిద్దాం అని తెలియచేసారు .ఆడబిడ్డల తండ్రిగా ఈ కార్యక్రమానికి రావటం చాలా సంతోషంగా ఉంది అని అన్నారు 
కార్యక్రమంలో చిన్నారులకు జడ్పీటిసీ తనయుఁడు రామకృష్ణ  సర్పంచి బలరాజ్  డిప్యూటి సర్పంచి నర్సింలు గౌడ్  బుక్స్ పాడ్స్ అందజేశారు
కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు  బాలికలు  తదితరులు పాల్గొన్నారు