22వ డివిజన్ లో ఏడు లక్షల వ్యయంతో డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన చేసిన..... మేయర్

Published: Thursday July 08, 2021
బాలాపూర్: (ప్రతినిధి) ప్రజాపాలన న్యూస్ : పలు కాలనీవాసుల సమస్యలను తెలుసుకొని త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన కార్పొరేషన్ మేయర్. బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 22వ డివిజన్ కార్పొరేటర్ లిక్కి మమత కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పట్టణ ప్రగతి, హరితహారం తో పాటు 7 లక్షల వ్యయంతో జి ఎన్.ఆర్ కాలనిలో డ్రైనేజ్  పైప్ లైన్ కు కార్పొరేషన్ అధికారులు తో కలిసి కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి బుధవారం నాడు శంకుస్థాపన చేశారు. డ్రైనేజ్ పైప్ లైన్ త్వరగా ఏస్తున్న సందర్భంగా స్థానిక కార్పొరేటర్, పలువురు కాలనీ వాసులతో కలిసి ముఖ్య అతిథులను  సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...... కార్పొరేషన్ డెవలప్మెంట్ కావటానికి ప్రతి డివిజన్ కాలనీ వాసులు అందరూ సహకరించాలని కోరారు. దశల వారీగా వివిధ కాలనీల సమస్యలు త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పట్టణ ప్రగతి లో భాగంగా హరితహారాని పలు కాలనీల్లో పచ్చదనంగా చూడాలని అందుకు కాలనీలో ఉన్న అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు ప్రజలు అందరూ సహకరించాలని ఆమె అన్నారు. స్థానిక కార్పొరేటర్ ప్రతి కాలనీ వాసులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి సమస్యల, పరిష్కారం చేస్తున్నానని చెప్పారు. ఇంటింటికి ఆరు మొక్కలు చొప్పున అందజేశారు. ఈ కార్యక్రమం శివనారాయణ పురం కాలనీ వాసులు, స్థాయి టౌన్ షిప్ కాలనీవాసులు, సాయి ప్రభు హోమ్స్, జి ఎన్ ఆర్ కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.