కోరుట్ల ఆర్టిసి డిపోలో విషాదం డీ.ఐ పిప్పోజి వేణు గుండెపోటుతో అకాల మరణం

Published: Tuesday February 01, 2022

కోరుట్ల, జనవరి 31 (ప్రజాపాలన ప్రతినిధి): కోరుట్ల ఆర్టీసీ డిపోలో విధులు నిర్వహిస్తున్న పిప్పోజి వేణు వయస్సు 42 గుండెపోటుతో మరణించగా డిపో అధికారులు డ్రైవర్లు కండక్టర్లు తోటి సిబ్బంది కన్నీటి పర్యంతమయ్యారు పూర్తి వివరాల్లోకి వెళితే సోమవారం ఉదయం 5 గంటలకు రోజు వారి లాగే విధుల్లోకి వచ్చిన వేణు తన పని తాను చేసుకునే సమయంలో చాతిలో నొప్పి వస్తుందని మామూలు నొప్పి కావచ్చు అని ఎవరికీ చెప్పకుండా హాస్పిటల్ కి వెళ్లిన వేణు అక్కడే గుండెపోటు వచ్చి అక్కడికక్కడే చనిపోయాడు. వేణు చదువు పరంగా ఎం.ఏ.అలాగే ఇతర ఇతర కోర్సుల్లో మంచి పట్టు ఉంది అలాగే ఓ మంచి ఆర్టిస్టు కూడా వృత్తిపరంగా డ్రైవర్ కావడంతో కోరుట్ల ఆర్ టి సి డిపో లో విధుల్లో చేరారు దాదాపుగా 12 సంవత్సరాలుగా కోరుట్ల లో విధులు నిర్వహిస్తున్నారు వేణు మొదటగా ఆర్టీసీ బస్సు డ్రైవర్ గా విధుల్లో చేరి తనదైన రీతిలో విధులు నిర్వహిస్తూ పై అధికారుల దృష్టిని ఆకర్షించడంతో వేణుకు కోరుట్ల డిపో లో ఎస్.డి.ఐ.గా విధులు నిర్వహించడానికి అవకాశం ఇచ్చారు తనదైన రీతిలో డ్రైవర్ లకు సిబ్బందికి శిక్షణనిస్తూ మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తి. పిప్పోజి వేణు. డిపో మేనేజర్ మాట్లాడుతూ ప్రతి పనిలో ముందుండే వ్యక్తి మా కుటుంబ సభ్యుల్లో ఒకరిని కోల్పోయిన దానికంటే ఎక్కువ బాధగా ఉంది అని అన్నారు వేణు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలపారు.