కరోనా టీకా పంపిణీ సజావుగా జరిగేలా చూడండి

Published: Wednesday June 16, 2021
మేడిపల్లి, జూన్15 (ప్రజాపాలన ప్రతినిధి) : పొదుపు సంఘాల మహిళలకు కరోనా టీకా పంపిణీ సజావుగా జరిగేలా చూడాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ ముందుమల్ల రజిత పరమేశ్వర్ రెడ్డి అధికారులకు సూచించారు. ఉప్పల్లో ప్రభుత్వ పాఠశాలలో పొదుపు సంఘాల మహిళల కోసం ప్రత్యేకంగా కరోనా టీకా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మంగళవారం టీకా కేంద్రాన్ని ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, కార్పొరేటర్  రజితపరమేశ్వర్ రెడ్డి, జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, ఎస్ఈ అశోక్ రెడ్డి, ఉప్పల్ డిప్యూటీ కమీషనర్ అరుణ కుమారి, ఈఈ నాగేందర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు సంతోష్ రెడ్డి, బాకారం లక్ష్మణ్, బోరంపేట జై కృష్ణ, పూజల హనుమాన్ దాస్, సుంకు శేఖర్ రెడ్డి, సల్ల ప్రభాకర్ రెడ్డి, లింగంపల్లి రామకృష్ణ, పాలడుగు లక్ష్మణ్, మంద మురళీకృష్ణ రెడ్డి, రాజేందర్ రెడ్డి, జనగాం రామక్రిష్ణ, అల్వాల్ భాస్కర్, ఆలుగులా అనీల్ కుమార్, బోరంపేట రామ్, గౌరీశెట్టి సీను, ఢిల్లీ చంద్రశేఖర్ రెడ్డి జుత్తు రెడ్డి, కన్నమైన నరేష్, తదితరులు పాల్గొన్నారు.