క్రీడలతో మానసిక ఉల్లాసం

Published: Wednesday January 04, 2023
*-విద్యార్థుల్లో దాగివున్న క్రీడానైపుణ్యం వెలికి తీయాలి
*-జడ్పి చైర్ పర్సన్ పట్నం సునీతారెడ్డి
వికారాబాద్ బ్యూరో 03 జనవరి ప్రజా పాలన : క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుఢ్యత పెరుగుతుందని జడ్పి చైర్ పర్సన్ పట్నం సునీతారెడ్డి అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో మంది విద్యార్థుల్లో క్రీడానైపుణ్యం  ఉన్నా ప్రోత్సహం లేక బయట పడడం లేదన్నారు. ఉపాధ్యాయులు తమ విద్యార్థుల్లో దాగివున్న  క్రీడానైపుణ్యం  గుర్తించి ప్రోత్సహించాలని సూచించారు. మంగళ వారం వికారాబాద్ భృంగి ఇంటర్నేషనల్ పాఠశాలలో జరిగిన 20వ వార్షికోత్సవ స్పోర్ట్స్ మీట్ ను మాజీ మంత్రి, పాఠశాల చైర్మన్ చంద్రశేఖర్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ  స్పోర్ట్స్ మీట్ ల వలన ప్రతిభా వంతులైన క్రీడాకారులను గుర్తించవచ్చన్నారు. క్రీడల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తే ప్రభుత్వ ఉద్యోగాలు మెండుగా వస్తాయని చెప్పారు. విద్యార్థులు, యువకులు చదువుతో పాటు క్రీడల పై దృష్టిపెట్టాలని సూచించారు. ఈ సందర్భంగా సునీతారెడ్డికి పాఠశాల యాజమాన్యం ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జడ్పి వైస్ చైర్మన్ విజ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్, పాఠశాల ప్రధాన కార్యదర్శి ప్రమీల చంద్రశేఖర్, ప్రిన్సిపాల్ రమాదేవి, డైరెక్టర్ కుమార స్వామి, కోటపల్లి ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి,  బీజేపీ జిల్లా అధ్యక్షుడు తొడిగల సదానంద్ రెడ్డి, అఖిల భారత బంజార సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాఘవన్ నాయక్, ధారూర్ పీఏసీఎస్ చైర్మన్ హన్మంత్ రెడ్డి,  స్థానిక  కౌన్సిలర్ లు, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.