ప్రజల ఆరోగ్యమే బిఆర్ఎస్ పార్టీ యొక్క లక్ష్యం, ప్రజల ఆరోగ్యానికి బిఆర్ఎస్ పార్టీ పెద్దపేట. జడ

Published: Wednesday October 26, 2022
పడకల ఆసుపత్రిని మణుగూరు జడ్పిటిసి పోశం నరసింహారావు మంగళవారం నాడు సందర్శించారు 100 పడకల ఆసుపత్రిని అభివృద్ధిని చేయడంలో భాగంగా ప్రత్యేక ఆపరేషన్ థియేటర్ కోసం వచ్చిన సామాగ్రిని పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే శ్రీ రేగా కాంతారావు ప్రత్యేక శ్రద్ధతో గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు సహకారంతో ఈ హాస్పిటల్ అభివృద్ధికి కీలక పాత్ర పోషించారు అని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కలవకుంట్ల చంద్రశేఖర రావు  ఆదేశాల అనుసారంగా ఈ వంద పడకల ఆసుపత్రి అభివృద్ధికి శ్రీకారం చుట్టారు అందుకు ముఖ్యమంత్రి కి హృదయపూర్వక పినపాక నియోజకవర్గం ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మణుగూరు బి ఆర్ ఎస్ మండల పట్టణ అధ్యక్షులు ముత్యం బాబు, అడపా అప్పారావు, సొసైటీ అధ్యక్షులు కురి నాగేశ్వరరావు, మండల కో ఆప్షన్ సభ్యులు జావేద్ పాషా తదితరులు పాల్గొన్నారు.