ఐ.ఐ.ఐ.టీ బాసర విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి

Published: Tuesday June 21, 2022
బహుజన సాధికారత సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు గంధం పుల్లయ్య
 
బోనకల్, జూన్ 20 ప్రజా పాలన ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో నిర్మల్ డిస్ట్రిక్ట్ లో బాసర ఐఐఐటి లో చదువుతున్న విద్యార్థుల కనీస వసతుల కోసం గత వారం రోజుల నుంచి నిరసనలు తెలియ చేస్తున్న విద్యార్థులకు మద్దతుగా బహుజన సాధికారత సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు గంధం పుల్లయ్య సామాజిక ఉద్యమ నేత బాసర ఐ.ఐ.ఐ.టీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఫ్లకార్డు తో నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బార్లు, వైన్స్ మీద వున్న శ్రద్ధ విద్య వ్యవస్థ మీద లేదని , విద్య వ్యవస్థ మీద తెరాస ప్రభుత్వానికీ చిత్త శుద్ధి ఉంటే తక్షణమే బాసర ఐఐఐటీ విద్యార్థుల న్యాయపరమైన పన్నెండు డిమాండ్లను తీర్చాలని, ఏదైతే విద్యార్థులు కోరుకుంటున్నారో పన్నెండు డిమాండ్లను తీరుస్తాము అని విద్య శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ప్రభుత్వం తరుపున లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.