శ్రీ స్వామి అయ్యప్ప దేవాలయం అన్నదానం మధిర అక్టోబర్ 26 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధి

Published: Thursday October 27, 2022
శ్రీ స్వామి అయ్యప్ప దేవాలయంలో మాలాదారులకు, నేటి నుండి డిసెంబర్ 27వ తారీకు వరకు ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం జరుగునని స్వామి అయ్యప్ప దేవాలయం ట్రస్ట్ వారు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్తీక మాసం లో మొదటి రోజు దాతలు సహకారంతోమాలాధారులకు నిత్య అన్నదానమ కార్యక్రమము ప్రారంభించడం జరిగినది కావున అయ్యప్ప మాలాధారులు సకల దేవతల మాలాదారులు ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని స్వామి అన్న ప్రసాదం స్వీకరించి స్వామి అయ్యప్ప కృపకు పాత్రులు కాగలరు ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూఅన్నదాన కార్తీక మాసంలో బుధవారం నాడు స్వామి అయ్యప్ప దేవాలయంలో అన్నదాన కార్యక్రమం చేయడం శుభదినం అని మాలాధారులకు అన్నదానం చేయటం వల్ల స్వామి అయ్యప్ప దీవెనలు ఉండాలని వారు తెలిపారు ఈరోజు నుండి ఈ కార్యక్రమము 63 రోజులు అనగా ఈ రోజు నుండి 27 డిసెంబర్ 2022 వరకు నిర్వహించడం జరుగుతున్నది , శ్రీ స్వామి అయ్యప్ప దేవాలయం ట్రస్ట్ వారు తెలిపారు ఈ కార్యక్రమంలో అందరూ ఆహ్వానితులే స్వామియే శరణమయ్యప్ప అందరికి కృతజ్ఞతలు,.