తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ

Published: Wednesday January 25, 2023
* వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల
వికారాబాద్ బ్యూరో 24 జనవరి ప్రజా పాలన : వికారాబాద్ జిల్లా తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ద్వారా రూపొందించబడిన 2023 సంవత్సరపు క్యాలెండర్ ను జిల్లా కలెక్టర్ నిఖిల ఆవిష్కరించినారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా టీజీవో అసోసియేషన్ ప్రెసిడెంట్ కోటాజితో   కలిసి క్యాలెండర్ ను ఆవిష్కరించారు.  ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి అశోక్ కుమార్, రెవెన్యూ డివిజనల్ అధికారి విజయ కుమారి, అసోసియేట్ ప్రెసిడెంట్ దీప, జనరల్ సెక్రెటరీ మల్లేశం, ట్రెజరర్ రామ్ రెడ్డి తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.