సమన్వయంతో పనిచేసి సమైక్యతా వజ్రోత్సవాలను విజయవంతం చేయాలి

Published: Wednesday September 14, 2022

మధిర రూరల్  సెప్టెంబర్ 13 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం నాడు  అధికారులందరూ సమన్వయంతో పనిచేసి సమాక్యాతా వజ్రోత్సవాలను విజయవంతం చేయాలని డిసిపి (లా అండ్ ఆర్డర్) సుభాష్ చంద్రబోస్ సూచించారు. ఈ నెల 16,17,18 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా  నిర్వహిస్తున్న తెలంగాణ వజ్రోత్సవాలను విజయవంతం కోసం మంగళవారం మండల స్థాయి అధికారులతో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 16వ తేదీన ఉదయం 11 గంటలకు 15వేల మందితో మధిరలో ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. 17వ తేదీన ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయటం జరుగుతుందన్నారు. 18న తేదీన స్వతంత్ర సమరయోధులను సన్మానించడం జరుగుతుంద న్నారు. ర్యాలీ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పేర్కొన్నారు. అదే విధంగా ప్రజలు అధిక సంఖ్యలో సమైక్యత వజ్రోత్సవంలో పాల్గొనాలని ఆయన కోరారు. అనంతరం ర్యాలీ బహిరంగ సభ జరిగే మార్కెట్ యాడ్ ప్రదేశాన్ని పరిశీలించారు అదేవిధంగా కాజీ పురం వద్ద రూరల్ పోలీస్ స్టేషన్ కోసం కేటాయించిన స్థలాన్ని సైతం ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ రవీందర్ నాధ్ వైరా ఏసిపి రెహమాన్ సీఐ మురళి విద్యుత్ శాఖ ఏడిఈ అనురాధ తహశీల్దార్ రాంబాబు కమిషనర్ అంబటి రమాదేవి ఎంపిడిఓ విజయభాస్కర్ రెడ్డి ఐసిడిఎస్ సిడిపిఓ శారద శాంతి వీరభద్రమ్మ ఫైర్ ఆఫీసర్ వెంకటేశ్వరావు తదితరులు ఎస్ఐలు సతీష్ కుమార్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.