మానవత్వం చాటుకున్న రూరల్ ఇన్స్పెక్టర్ కృష్ణ కుమార్

Published: Tuesday June 01, 2021
జగిత్యాల, మే 31, (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాల పట్టణంలోని సోమవారం రోజున మధ్యాహ్నం జంబిగద్దె వద్ద జగిత్యాల రూరల్ ఇన్స్పెక్టర్ వై. క్రిష్ణ కుమార్ తన సిబ్బంది అయిన గన్మెన్ అంజయ్య హోంగార్డ్ సులెమాన్ ఖాన్ డ్రైవర్ లక్ష్మణ్ కలసి మద్యాహ్నం సమయంలో పెట్రోలింగ్ చేస్తున్నారు. అదే సమయంలో అర్పపల్లికి చెందిన ప్రవీణ్ అనే వ్యక్తికి అకస్మాత్తుగా పిడుసు వచ్చి కిందపడిపోయి కొట్టుమిట్టాడుతున్నాడు వెంటనె స్పందించిన సిఐ కృష్ణ కుమార్ తన పోలీసు వాహనాన్ని అపి పిడుసు వచ్చిన ప్రవీణ్ ను తన పోలీసు వాహనంలో జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. ప్రస్తుతం ప్రవీణ్ ఆరోగ్యం నిలకడగా ఉండడంతో మానవత్వం చాటుకున్న సీఐ సాబ్ అని అక్కడ ఉన్న వాలందరు సంతోషం వ్యక్తం చేశారు.