ఐలమ్మ జీవితం స్ఫూర్తిదాయకం

Published: Monday November 21, 2022

మధిర  నవంబర్ 20 (ప్రజా పాలన ప్రతినిధి) ఉద్యమ కెరటం చాకలి ఐలమ్మ జీవితం నేటి సమాజానికి స్ఫూర్తిదాయకమని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు తెలిపారు. మధిర పట్టణంలోని నందిగామ క్రాస్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆదివారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ 2022 నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం మాట్లాడుతూ భూమికోసం, భుక్తి కోసం, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వీర వనిత ఐలమ్మ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మధిర మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లతా జయాకర్, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.