వరల్డ్ ఫిట్నెస్ ఫెడరేషన్ ఇండియా బాడీబిల్డింగ్ లో వికారాబాద్ కు ద్వితీయ స్థానం

Published: Tuesday April 06, 2021
వికారాబాద్, ఏప్రిల్ 05, ప్రజాపాలన ప్రతినిధి : తెలంగాణ స్టేట్ చాంపియన్ షిప్ 2021 బాడీబిల్డింగ్ పోటీల్లో భాగంగా హైదరాబాద్ లో వరల్డ్ ఫిట్నెస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (తెలంగాణ) ఆధ్వర్యంలో 03 ఏప్రిల్ 2021 శనివారం  నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో వికారాబాద్ ఎస్ఆర్ జివైఎం నిర్వాహకులు సాయిరాం అత్యంత ప్రతిభ కనపర్చి రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానాన్ని సంపాదించారు. దాతలు ఆర్ధికంగా సహాయపడినట్లైతే ఇండియా లెవెల్ లో పోటీపడడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అదేవిధంగా ఇంతకు ముందు జరిగిన సౌత్ ఇండియా పోటీలో 10వ స్థానాన్ని, నిజమాబాద్ లో జరిగిన రాష్ట్ర స్థాయిలో 4వ స్థానాన్ని, సంగారెడ్డి లో జరిగిన హార్డ్ వర్క్ క్లాసిక్ లో ద్వితీయ స్థానాన్ని పొంది ఎక్కడికెళ్లినా తాను చక్కటి నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నారు. వికారాబాద్ లో ఎస్ఆర్ జివైఎం ద్వారా అనేకమంది యువకులకు బాడీ బిల్డింగ్ లో చక్కని శిక్షణను ఇచ్చి మంచి శిక్షకుడిగా కూడా పేరును సంపాదిస్తున్నారు. దాతలు ఆర్థిక సహాయం అందించినట్లైతే ఇండియా లెవెల్లో కూడా పోటీ పడటానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.