సారంగాపూర్ మండలంలో 73వ గణతంత్ర వేడుకలు

Published: Thursday January 27, 2022

సారంగాపూర్, జనవరి 26 (ప్రజాపాలన ప్రతినిధి): సారంగాపూర్ మండల్ కేంద్రంలో 73వ గణతంత్ర దినోత్సవం రోజున ఎంపీడీఓ తహశీల్దార్ పోలీసు స్టేషన్ ఎంఈవో ఏవో కార్యాలయాల్లో జాతీయ జెండాలను ఎగరేసి వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కోల జమునశ్రీనివాస్ జడ్పీటీసీ మేడిపల్లి మనోహర్ రెడ్డి వైస్ ఎంపీపీ సోల్లు సురేందర్ తహశీల్దార్ శ్రీలత ఎంపిడివో వెంకటేశం వైద్యాధికారి మైత్రిరాణి ఎస్సై రామకృష్ణ ఆర్ఐ జమున తిరుపతి నాయక్ సర్పంచ్ గుర్రాల రాజేందర్ రెడ్డి ఎంపీటీసీ జోగినపల్లి సుధాకర్ రావు ప్యాక్స్ చైర్మన్ ఏలేటి నరసింహా రెడ్డి అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.