హుజూరాబాద్ లో ఈటెల ను ప్రజలు ఏవగించుకుంటున్నారు అందుకే మతి భ్రమించిన ఈటెల వ్యాఖ్యలు చేస్తు

Published: Monday July 18, 2022
కరీంనగర్ జూలై 17 ప్రజాతంత్ర
 
హుజురాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కు ప్రజాభిమానం రోజురోజుకు సన్నగిల్లితోందని అందుకనే రాజేందర్ మతి భ్రమించిన వ్యాఖ్యలు చేస్తున్నారని టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సుడా చైర్మన్ జివి రామకృష్ణారావు మండిపడ్డారు. ఆదివారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గం లో సీఎం కేసీఆర్ పై పోటికి దిగుతానని ప్రగల్బాలకు దిగడం విడ్డూరంగా ఉందన్నారు. ఈటెల రాజేందర్ రాజకీయ ఎదుగుదలకు ఎంతగానో దోహదపడిన టిఆర్ఎస్ పార్టీపై ఈటెల ఆరోపణలు చేయడం సిగ్గుచేటుగా ఉందన్నారు. దేశంలో అవినీతి అక్రమాలలో కూరుకపోయినా నేతలను ఈటల ఆదర్శంగా తీసుకోవడం ఆశాస్పదంగా ఉందన్నారు. సమాజంలో మేధావులు, సమాజ దిక్షీతులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నో,లేదా జ్యోతిరావు పూలేనో ఈటెల ఆదర్శంగా తీసుకొని వ్యాఖ్యలు చేస్తే బాగుండేదని ఆయన ఎద్దేవా చేశారు.ఈటల ఎక్కడినుండి పోటీ చేసిన తమ పార్టీకి  వచ్చే  నష్టం ఏమి లేదని,టిఆర్ఎస్ పార్టీపై నిందలు వేస్తే తామేమాత్రం సహించబోమని ఆయన హెచ్చరించారు. హుజరాబాద్ ఎమ్మెల్యేగా ఈటిల రాజేందర్ గెలిచి 8 నెలలు అవుతున్నా ఇప్పటివరకు అక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టని కారణంగానే  ఆ ప్రాంత ప్రజలు ఈటలను ఓడించేందుకు సిద్ధమయ్యారని,అందుకనే ఆయనకు కు ఓటమి భయం పట్టుకుందని, కనుకే ఈటెల గజ్వేల్ నియోజక‌ వర్గం ప్రస్థావన తెరపైకి తీసుకవస్తున్నారన్నారు.మహ గొప్ప నేత కేసీఆర్ పై పోటికి దిగుతాననడం హస్యస్పదంగా ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి పార్టీ ప్రభావం ఏమాత్రం ఉండబోదని, మళ్లీ టిఆర్ఎస్ పార్టీయే అధికారంలోకి రావడం ఖాయమని ఆయన నొక్కి వక్కాణించారు.  ప్రధాని మోడీ దేశంలో నల్లధనాన్ని వెలికి తీస్తానని చెప్పి, పెద్ద నోట్లను రద్దుచేసి సామాన్య మద్యతరగతి ప్రజల జీవితాలను అతలా కుతలం చేశాడన్నారు.దేశంలో మోదీ ఇప్పటివరకు  సాధించిందేదీ లేదని ఆయన కొట్టి పారేశారు.
ఇటీవల హైదారాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధాని మోది ఉధ్యమ టీఆర్ఎస్ పార్టీని పట్టుకుని, అదొ పొట్టి పార్టంటూ మోదీ ఎద్దేవా చేయడం సిగ్గుచేటని,
బీజేపీ పార్టీయే బొందల,పెంటల పార్టీ అని జీవికే రావు ఎత్తిపొడిచారు. తెలంగాణలో  రెండు అసెంబ్లీ స్థానాలున్నా   బీజేపీ పార్టీ ఏం సాధిస్తుందో ఈటెల గుర్తెరుగాలన్నారు.రాష్టం మొత్తంలో నూట పంథొమ్మిది అసెంబ్లీ స్థానాలలో నూట మూడు స్థానాలు మావేనని,అలాగే 13 నగరపాలక సంస్థల్లో పది కార్పోరేషన్ లు తమవేనని,140 ఎంపిపి స్థానాలకు 130 స్థానాలు టీఆర్ఎస్ వేనని,40  ఎంఎల్సీ స్థానాల్లో 40 స్థానాలు టీఆర్ఎస్ వి కాదా అని ఆయన ఈటెలను ప్రశ్నించారు. రాష్ట్రంలో బీజేపీ ఎంత బలం ఎంతో ఈటెల నిరూపించాలన్నారు.ఈటెలకు దమ్ము, ధైర్యం ఉంటే కేంద్రాన్ని ఒప్పించి కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హొదా వచ్చేలా పోరాడాలే తప్పా టీఆర్ఎస్ పై అవాకులు చెవాకులు పేలిస్తే ఏమాత్రం ఊరుకోబోమని హెచ్చరించారు.ఈ సమావేశంలో టీఆర్ఎస్ నేతలు  చీటీ రాజేందర్ రావు,గ్రంధాలయ చేర్మన్ ఏనుగు రవిందర్ రెడ్డి , సుడా డైరెక్టర్ శ్రీనివాస్ గౌడ్ హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు.