లంపి స్కిన్ (ముద్ద చర్మ) వైరస్ పట్ల పాడి రైతులు అప్రమత్తంగా ఉండాలి

Published: Friday October 28, 2022
మండల పశు వైద్యాధికారి డాక్టర్ శ్రీకాంత్
 జన్నారం అక్టోబర్ 27 ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో లంపి స్కిన్ (ముద్ద చర్మ) వైరస్ పట్ల పాడి రైతులు అప్రమత్తంగా ఉండాలని గురువారం మండల పశు వైద్యాధికారి డాక్టర్ శ్రీకాంత్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని వివిధ గ్రామాలలో లంపి స్కిన్ ముద్ద చర్మ వైరస్ పట్ల కొనసాగుతున్న ఉచిత వాక్సినేషన్ టీకాలు కార్యక్రమం  కొత్తూరు పల్లె, హాస్టల్ తండా, చర్ల పల్లే, దేవునిగూడ, కావ్వాల్ , రాంపూర్, తిమ్మాపూర్, లింగయ్య పల్లె, పోన్కల్, మురిమడుగు గ్రామాల్లో టీకాలు అందించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు మండలంలో వివిధ గ్రామాల్లో లంపి స్కిన్ (ముద్ద చర్మ) వ్యాధి నివారణ టీకాలు పశువులకు 4వేల పైన అందిచడం జరిగిందని, రైతులు అందరూ అపోహలు వీడి ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే వైరస్ బారిన పడకుండా జీవాలను కాపాడుకోవాలి. ఈ కార్యక్రమంలో సంజీవ్, సాగర్, రెహమాన్, కిషన్, వినోద్, రవి, శిరీష, రాహుల్, రాజన్న గోపాలమిత్ర  రైతులు, పశువులు, తదితరులు పాల్గొన్నారు.