సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతున్న ఆర్యవైశ్య గణపతి ఉత్సవాలు -మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్ల

Published: Friday September 02, 2022
మంచిర్యాల బ్యూరో, సెప్టెంబర్01, ప్రజాపాలన: 
 
 
సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షిస్తు వైభవోపేతంగా మంచిర్యాల ఆర్యవైశ్య సంఘం, వాసవీ ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు మంచిర్యాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు అన్నారు. బుధవారం రాత్రి స్థానిక విశ్వనాథ ఆలయ కాలక్షేప మండపంలో ఏర్పాటు చేసిన ఆర్యవైశ్య సంఘం, వాసవీ ఆర్యవైశ్య యువజన సంఘం ఏర్పాటు చేసిన గణేష్ మహల్ ను మంచిర్యాల డిసిపి అఖిల మహాజన్, మున్సిపల్ ఛైర్ పర్సన్ పెంట రాజయ్యతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం గణేష్ మహల్లో ఏర్పాటు చేసిన పర్యావరణ పరిరక్షణలో భాగంగా గత ఐదు సంవత్సరాలుగా ఏర్పాటు చేస్తున్నట్లు గానే ఈ యేడు కూడా ఏర్పాటు చేసిన మట్టి వినాయక విగ్రహానికి అతిథులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత నలభై సంవత్సరాలుగా వైశ్య సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ గణనాధునికి ప్రత్యేక రీతిన పూజా కార్యక్రమాలను, సంస్కృతి సాంప్రదాయాల ను రక్షించుకునే విధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారని కొనియాడారు. అలాగే రెండవ రోజు గురువారం గణేశ మహల్ వద్ద ఆర్య వైశ్య దంపతుల సహకారంతో వాసవి కన్యకా పరమేశ్వరి వ్రత కల్పము, 102 చీరెంతో వాసవిమాతకు అలంకరణ చేశారు. ఈ కార్యక్రమాలలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు దొంతుల ముఖేష్, యువజన సంఘం అధ్యక్షుడు కంభంపాటి కమలాకర్, మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్ రావు, బిజెపి జిల్లా అధ్యక్షుడు రఘునాథరావు, విశ్వనాథ ఆలయ ఛైరన్ సిరిపురం శ్రీనివాస్, వార్డు కౌన్సిలర్ మాదంశెట్టి సత్యనారాయణ, సీఐ నారాయణ నాయక్, వైశ్య సంఘం నాయకులు ముక్తా శ్రీనివాస్, చిలువేరు వైకుంఠం, చిలువేరు శ్రీనివాస్, కొండా చంద్రశేఖర్, చందూరి మహేందర్ తో పాటు ఆర్యవైశ్య సంఘం, వాసవీ ఆర్యవైశ్య యువజన సంఘం నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.