టీవీ ఎం స్కూల్లో మేడే సందర్భంగా పాల్గొన్న జడ్జి

Published: Monday May 02, 2022
మధిర మే 1 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం నాడుప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా టీవీ ఎం హై స్కూల్ నందు న్యాయ సేవా దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మధిర న్యాయమూర్తి ధీరజ్ కుమార్ మాట్లాడుతూ కార్మికులందరూ దేశంలోనే కార్మిక చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, అదేవిధంగా అసంఘటిత  రంగ కార్మికులు అందరూ కూడా కార్మిక శాఖ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళ యొక్క హక్కుల్ని పొందాలని, 14 సంవత్సరాలు పైబడ్డ అసంఘటిత కార్మికులు అందరూ కూడా చట్టాల పట్ల అవగాహన కల్పించాలని కచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని  మాట్లాడారు. ఈ కార్యక్రమంలో  అధ్యక్షులు B.పుల్లారావు సీనియర్ న్యాయవాదులు దిరిశాల జగన్మోహన్ రావు, వాసంశెట్టి కోటేశ్వరరావు, చావలి రామరాజు,  కోట జ్ఞానేశ్, గంధం శ్రీనివాసరావు, రూరల్ సబ్ ఇన్స్పెక్టర్ V.భవాని అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ చంద్ర, కోర్టు ఉద్యోగి సూర్యనారాయణ కార్మికవర్గ ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు...