*మతం ముసుగులో ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీజేపీ ని గద్దె దింపుతాం* *కార్పొరేట్ శ

Published: Thursday March 30, 2023

చేవెళ్ల మర్చి 29, (ప్రజాపాలన ):-

ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ , కార్పొరేట్ కంపెనీలకు కొమ్ము కాస్తున్న  బిజెపిని  ప్రభుత్వంను గద్దె దింపుతామని, సిపిఎం చేవెళ్ల డివిజన్ ఇంచార్జ్ అల్లి దేవేందర్ అన్నారు.
ఈనెల 17వ తారీఖున ప్రారంభమైన సిపిఎం జనచైతన్య యాత్ర అనేక జిల్లాలు తిరుగుతూ ఇందిరాపార్క్ వద్ద ఈరోజు ముగింపు సభకు సిపిఎం పార్టీ చేవెళ్ల డివిజన్ ఇంచార్జ్ అల్లి దేవేందర్ ఆధ్వర్యంలో చేవెళ్ల నియోజకవర్గం నుండి కార్యకర్తలు తరలి వెళ్లగా, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలు పూర్తవుతున్న ప్రజలకు ఎలాంటి లాభం లేదని అన్నారు.నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడం పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్లు విపరీతంగా పెరగడం పేద మధ్య తరగతి ప్రజలు బ్రతికే పరిస్థితి లేదని మండిపడ్డారు.
ఇది పేదల ప్రభుత్వం కాదని బడా కార్పొరేట్ల పెట్టుబడిదారుల ప్రభుత్వమని అన్నారు.2014లో గౌతమ్ అదాని ఆస్తి కేవలం 50 వేల కోట్లు కానీ ప్రస్తుతం ఆయన ఆస్తులు 19.50 కోట్లకు పెరిగిందని అన్నారు.మోడీ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను కార్పోరేట్లకు కారు చౌకగా అప్పచెప్పుతుందని అన్నారు కాబట్టి రాబోయే ఎన్నికలలో బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ఎర్రజెండా సిపిఎం పార్టీ పనిచేస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం చేవెళ్ల నియోజకవర్గ నాయకులు యాదయ్య మల్లారెడ్డి బాలరాజ్ ప్రభుదాస్ ఎస్ఎఫ్ఐ చేవెళ్ల డివిజన్ అధ్యక్షులు అరుణ్ కుమార్ డివిజన్ కార్యదర్శి శ్రీనివాస్ ఎస్ఎఫ్ఐ చేవెళ్ల మండల నాయకులు సాయి గణేష్ తదితరులు పాల్గొన్నారు