నూతన పార్లమెంట్ భవనానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు నామకరణం చేయాలి. జాతీయ మాల మహానాడు బూర

Published: Monday December 05, 2022

జాతీయ మాల మహానాడు ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు పుట్టి  శ్రీను, పినపాక నియోజకవర్గం ఇంచార్జ్, బూర్గంపాడు మండల అధ్యక్షులు పిల్లి. రవివర్మ డిమాండ్. నూతన పార్లమెంట్ భవనానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు నామకరణం చేయాలని జాతీయ మాల మహానాడు జిల్లా ఉద్యోగుల సంఘం అధ్యక్షులు పుట్టి శ్రీను, జాతీయ మాల మహానాడు పినపాక నియోజకవర్గం ఇంచార్జ్, మండల అధ్యక్షులు పిల్లి.రవి వర్మ లు అన్నారు. మండలంలోని ఉపసాక గ్రామంలో గ్రామ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. గ్రామ కమిటీ అధ్యక్షులుగా రెంటాల కృష్ణ, గ్రామ కార్యదర్శి గుండమాల కృష్ణ, మండల గౌరవ అధ్యక్షులుగా దుంపల బక్కయ్య, మండల కార్యదర్శి గంజి వెంకన్న  లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జాతీయ మాల మహానాడు ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు పుట్టి శ్రీను, జాతీయ మాల మహానాడు పినపాక నియోజకవర్గం ఇంచార్జ్, బూర్గంపాడు మండల అధ్యక్షులు పిల్లి రవి వర్మ మాట్లాడుతూ దేశంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు దళితులపై దాడులు పెరిగాయని అన్నారు. దళితుల మధ్య చిచ్చుపెట్టేందుకు వర్గీకరణ ను సుప్రీంకోర్టు కొట్టివేసిన దానిని కేంద్ర బిజెపి ప్రభుత్వం భుజాల మీద మోసుకొని వారికి వత్తాసు పడకగడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో బిజెపి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుదామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయానికి అంబేద్కర్ పేరు నామకరణం చేయడం శుభ పరిణామం అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల కోసం నిరంతరం కృషి చేస్తున్నారని   ఆయన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జి రాము, సిహెచ్ భాస్కర్, జి శ్రీను, డి నరేందర్, బి రవికుమార్, ఆర్ శేషు, డి శ్రీను, సిహెచ్ రవిబాబు తదితరులు పాల్గొన్నారు.