మహిళలపై అత్యాచారాలు ఆపాలి

Published: Wednesday September 15, 2021
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 14, ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలో 20 వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులడు ఎండి ఫిరోజ్ క్షమించు తల్లి స్వరాష్ట్రం అనుకున్నాం నీలాంటి చిట్టి తల్లుల మాన ప్రాణాలకి విలువ లేదని  ఒక జంతువు (అవుకి)ఇచ్చే విలువ ఈ దేశం లో మహిళలకు ఆడపిల్లలకు లేదు. దీనికోసమేనా త్యాగాలు చేసింది. ఈ రాష్ట్రం కోసం పోరాడింది ఇది అమానుషం, దారుణం, అత్యంత హేయం ఈ చిన్నారిపై పైశాచిక అత్యాచారం చేసి చంపడం అనేదీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కడు తీవ్రంగా ఖండించారు విషయం ప్రభుత్వం వెంటనే స్పందించి ఎన్ కౌంటర్ అయ్యేటట్టు కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము చెయ్యని యెడల ప్రభుత్వమే బాధ్యత తీసుకొని నిందితుని ఉరి తీయాలని కోరుతున్నాం మరెన్నో మహిళల పైనే దాడులు జరగడం శోచనీయమని ఆయన అన్నారు. శిక్ష నెరవేర్చని ఎడల ముందు ప్రభుత్వమే దోషిగా నిలబడాల్సి వస్తుంది ఆయన దుయ్యబట్టారు.