జిల్లాలో ఈ నెల 25 నుండి సదరం శిబిరాల నిర్వహణ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి బి. శేషాద్రి

Published: Monday January 23, 2023
మంచిర్యాల భ్యూరో‌,  జనవరి 21, ప్రజాపాలన :
 
జిల్లాలో ఈ నెల 25వ తేదీ నుండి సదరం శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి బి. శేషాద్రి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని దివ్యాంగులు ధృవీకరణ పత్రము పొందుటకు మీ-సేవలో స్లాట్ బుక్ చేసుకొని నిర్ణీత తేదీలలో జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలో సంప్రదించాలని, గతంలో పొందిన సదరం సర్టిఫికెట్ పరిమిత కాలము పూర్తి అయిన వారు పునఃరుద్దరణ కొరకు, నూతన సర్టిఫికెట్ పొందుటకు అవకాశం కల్పించడం జరిగిందని తెలిపారు. మూగ, చెవుడు వారికి ఈ నెల 25, ఫిబ్రవరి 2 తేదీలలో, మానసిక వికలాంగులకు ఈ నెల 30, ఫిబ్రవరి 27 తేదీలలో, శారీరక వికలాంగులకు (ఆర్థో) ఈ నెల 31, ఫిబ్రవరి 8 తేదీలలో శిబిరాలు ఉంటాయని, రోజుకు 50 మంది చొప్పున పరీక్షించడం జరుగుతుందని, కంటి చూపు సమస్య గల వారికి ఈ నెల 27, ఫిబ్రవరి 24 తేదీలలో శిబిరం నిర్వహించడం జరుగుతుందని, రోజుకు 30 మంది చొప్పున పరీక్షించడం జరుగుతుందని తెలిపారు. మీ-సేవ నందు స్లాట్ బుక్ చేసుకున్న వారు నిర్ణీత తేదీలలో సదరం క్యాంపుకు హాజరై దివ్యాంగ ధృవీకరణ పత్రాన్ని పొందాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.