ఉద్యోగులకు కార్పొరేట్ వైద్య సదుపాయం

Published: Friday May 27, 2022
ఆర్ కే -8 డిస్పెన్సరీని 30 పడకల ఆసుపత్రిగా మార్చేందుకు కృషి
సీఎంఓ డాక్టర్ బి. వెంకటేశ్వర రావు
 
నస్పూర్, మే 26, ప్రజాపాలన ప్రతినిధి: సింగరేణి ఉద్యోగులకు కార్పొరేట్ వైద్య సదుపాయం కల్పించడానికి కావాల్సిన అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుందని సీఎంఓ డాక్టర్ బి. వెంకటేశ్వర రావు తెలిపారు. గురువారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్ కే-8 డిస్పెన్సరీ లో నూతనంగా సుమారు 11 లక్షల రూపాయలతో నిర్మించిన వెయిటింగ్ హాల్, డీవై సీఎంఓ  కార్యాలయం, హెల్త్ ఆఫీసర్ కార్యాలయమును   సీఎంఓ డాక్టర్ బి వెంకటేశ్వర రావు,   శ్రీరాంపూర్ జీఎం బి. సంజీవ రెడ్డిలు  ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్ కే -8 డిస్పెన్సరీని 30 పడకల ఆసుపత్రి, ల్యాబ్, ఫిజియోథెరపీ సెంటర్ పెట్టడానికి అవకాశాలను సమీక్షించి, అనుమతి వచ్చేలా చర్యలు తీసుకోవడానికి కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి డీవై సీఎంఓ డాక్టర్ రమేష్ బాబు గారు అద్యక్షత వహించగా 
 ఎస్ఓ టూ జీఎం  కె. హరి నారాయణ గుప్తా, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నాయకులు పెట్టం లక్ష్మణ్, అధికారుల సంఘం నాయకులు శ్రీ అబ్దుల్ ఖాదీర్, రాజేశ్వర్ రెడ్డి ,  ఎవి.రెడ్డి , డీజీఎం పర్సనల్ అరవింద రావు ,   రామకృష్ణాపూర్ డీవై సీఎంఓ ఉష, డీజీఎం సివిల్ శివ రావు , డీజీఎం వర్క్ షాప్ చంద్రశేఖర్ రెడ్డి , ఐఈడి ఇన్చార్ట్  కిరణ్ కుమార్, డాక్టర్ నాగేశ్వర్ , హెల్త్ ఆఫీసర్ డాక్టర్ లోకనాథ్ రెడ్డి, డాక్టర్ స్వప్న,  మౌనిక,  వైద్య సిబ్బంది పాల్గొన్నారు.