బీసీ నాయకుడు ఈటల రాజేందర్ కు మద్దతుగా బొంతపల్లి కమాన్లో భారీ ఎత్తున ధర్నా నిర్వహించిన ముదిర

Published: Wednesday May 05, 2021
సంగారెడ్డి, మే 4, ప్రజాపాలన ప్రతినిధి : సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల బొంతపల్లి కమాన్ వద్ద మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై భూకబ్జా తదితర అసత్య ఆరోపణలు నేపంతో మంత్రి వర్గం నుండి కెసిఆర్ తోలిగిచడం బిసిలను అనగదోక్కడమేనని గుమ్మడిదల మండలం ముదిరాజ్ సంఘం నాయకులు మంగళవారం రోజు ఈటల రాజేందర్ పై అసత్య ఆరోపణలుకు, నిరసనగా భారీ ఎత్తున ధర్నా చేపట్టారు ఈటల జిందాబాద్ కెసిఆర్ డౌన్ డౌన్ నినాదాలతో ఆ ప్రాంతమంతా మర్రుమ్రోగింది, ధర్నా తోహైదరాబాద్ - మెదక్ ప్రధాన రహదారి కావడం తో భారీగా వాహనాలు నిలిచి పోయాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ముదిరాజ్ మీడియా ఇన్చార్జ్ శ్రీనివాస్, గుమ్మడిదల ముదిరాజ్ సంఘ అధ్యక్షుడు గ్యారాల మల్లేష్ మట్లాడుతూ ఈటెల రాజేందర్ తెలంగాణ  ఉద్యమం లో అలుపు ఎరుగని పోరాటం చేసిన నాయకుడని, ఎలాంటి మచ్చలేని నాయకుడు అని, టిఆర్ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రశ్నించినందుకే, ఈటల పై కక్ష గట్టి మంత్రి పదవి తొలగించారని, కుట్రతోనే మీడియా లో తప్పుడు వార్త కథనాలు ప్రచురిస్తున్నయని కెసిఆర్ కు బిసివర్గాలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే వున్నయని, కెసిఆర్ తెలంగాణ బిసి వర్గాలను మరియు ముదిరాజ్ సమాజానికి చేసి తప్పును సరిదిద్దుకోని క్షమాపణ చెప్పాలని, లేని ఎడల పెద్ద ఎత్తున ధర్నాలు చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉప అధ్యక్షులు వెంకటేష్, ప్రధాన కార్యదర్శి చింతల వీరేష్, మండల సలహాదారులు జింక గోపాల్, చింతల రామకృష్ణ, వీరారెడ్డి పల్లి స్వామి, టి. వీరేష్, ఉప్పరి వెంకటేష్, ఉప సర్పంచులు మొగులయ్య, దయానంద్, వివిధ గ్రామాల ముదిరాజ్ సంఘం అధ్యక్షులు, డి.నర్సింలు, రాజు, సత్యనారాయణ, వీరాస్వామి, రాములు, మహేష్, మహంకాళి, శంకర్, శేఖర్, దొమడుగు రామకృష్ణ, హరికృష్ణ, రాజు, అశోక్, బిక్షపతి, మరియు వివిధ గ్రామాల ముదిరాజ్ సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..