కనీస వేతనాలు సవరిస్తూ విడుదల చేసిన జీవోలను గెజిట్ చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు జగదీష్

Published: Wednesday July 27, 2022
మంగళవారం ఇబ్రహీంపట్నం లేబర్ సహాయక కమిషనర్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి అనంతరం ఎ.ఎల్.ఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కనీస వేతనాలు చట్టం పరిధిలో 73 షెడ్యూల్ పరిశ్రమలో పనిచేసే కార్మికులకు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పెరిగిన ధరలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు సవరించాల్సి ఉండగా తెలంగాణ వచ్చి 8 సంవత్సరాలు గడిచిన టిఆర్ఎస్ ప్రభుత్వం కార్మికుల కనీస వేతనం సవరించలేదని కార్మికుల పోరాటాల ఫలితంగా 2021 జూన్ నెలలో 5 జీవోలను విడుదల చేసిన గెజిట్ చేయలేదు. రంగారెడ్డి జిల్లాలో కాటేదాన్, గగనపహాడ్, శ్రీరామ్ కాలనీ, శాంతంరాయ్, కొత్తూరు, షాద్ నగర్, మంకాల, రావిరాల, ఆదిభట్ల, యాంజాల, జల్ పల్లి వంటి పారిశ్రామిక ప్రాంతాల్లో వేలాదిమంది కాంట్రాక్టు కార్మికులు  రోజువారి కూలీతో సమానంగా పనిచేస్తున్న గుర్తింపు కార్డు, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం, కనీస వేతనాలు లాంటివి అమలు చేయకపోగా ఉద్యోగ భద్రత కూడా లేదన్నారు. రంగారెడ్డి జిల్లాలో అత్యధికమంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పలస కార్మికులు ఉండడంతో కంపెనీ యజమానులు యదేచ్చగా వీరి శ్రమను దోపిడీ చేస్తున్నారు వీరికి రక్షణగా ఉండాల్సిన ప్రభుత్వం, లేబర్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా కాంట్రాక్టు కార్మికుల బతుకులు దుర్భరంగా ఉన్నాయన్నారు. కనుక ప్రభుత్వం వెంటనే స్పందించి కనీస వేతనాలు 26,000/- లు  అమలు చేసి ఈఎస్ఐ,పిఎఫ్, ఉద్యోగ భద్రత కల్పించాలని ట్రాన్స్ పోర్టు, హామాలి, రైస్ మిల్ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి. భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు నిధుల దుర్వినియోగం అరికట్టి కార్మికులందరికీ బోర్డ్ లో నమోదు చేయాలి. కార్మికులకు నష్టం కలిగించే 4 లేబర్ కోడ్ లను మోడీ ప్రభుత్వం రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.
  ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బ్రహ్మయ్య, కిషన్, జిల్లా నాయకులు ఎల్లయ్య, శేఖర్, మండల కన్వీనర్ బుగ్గరాములు, జంగయ్య, బాలరాజ్, పురుషోత్తం, సుజన, అంజయ్య, వెంకటయ్య, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.