నేడు కలెక్టర్ వీపీ గౌతమ్ బోనకల్ రాక

Published: Tuesday December 13, 2022
బోనకల్, డిసెంబర్ 13 ప్రజా పాలన ప్రతినిధి :మండల కేంద్రమైన బోనకల్ లో జిల్లా కలెక్టర్ వీ పీ గౌతమ్ మంగళవారం పర్యటించనున్నారు. ప్రాథమిక పాఠశాలలో కనీస విద్యా ప్రమాణాలను, విద్యా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'తొలిమెట్టు' కార్యక్రమంలో భాగంగా ఐదు మండలాల విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో మండల నోడల్, క్లస్టర్, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించినట్లు మండల విద్యాశాఖ అధికారి ప్రభాకర్ తెలిపారు.