పలకరింపు తో బెదిరింపులు - అధికారులతో సంప్రదింపులు

Published: Friday March 11, 2022

కూకట్ పల్లి :(ప్రజాపాలన) హైదర్ నగర్ డివిజన్ కూకట్ పల్లి సర్కిల్ పరిధిలోని అక్రమ నిర్మాణాల జోరు కొనసాగుతూనే ఉంది ఇప్పటికే అధికారులకు కొన్ని నిర్మాణాలు సవాల్ గా మారాయి. అంతర్లీనంగా ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఉన్నారు. సమతా నగర్ కాలనీ లో, పార్క్ సమీపంలో కడుతున్న ఈ కట్టడం కేవలం పర్మిషన్ స్టిల్ట్ ప్లస్ టూ కి తీసుకుని నాలుగు అంతస్తులు పైగా కట్టుకుంటూ పోతుంటే అధికారులు చోద్యం చూస్తున్నారు. నిత్య అక్రమ నిర్మాణాలతో కొనసాగుతున్న నోడల్ అధికారి వస్తారు, ఎదో చేస్తారు అని చెప్పడం పరిపాటిగా మార్చుకున్న అధికారులు తీరు స్థానిక ప్రజలకు అర్ధం కావడం లేదు. పిర్యాదులు పై స్పందించరు, సమాచార హక్కు చట్టం అంటే విలువలేదు ఇలా నిత్యం ఎదో ఒక సాకులు చెప్పుతూ అక్రమ నిర్మాణ దారులకు కొంగు కాస్తున్నారు. ఎయిడ్స్ రాకుండా ఉండాలంటే కండోమ్ వాడాలి అని చెప్తారు కానీ చాలా మంది ఆ రెండు నిముషాల సుఖం కోసం కక్కుర్తిపడి జీవితాలు నాశనం చేసుకుంటారు. అలాగే అధికారులు కూడా అవినీతికి ఆశపడి ఉద్యోగాలు చేస్తున్నారు భవిష్యత్తు సమస్యలు గుర్తించక పోవడం ఆ సామెత లాగా అవుతుంది అంటున్నారు. ఎన్ని పిర్యాదులు అందినా ఒక్క చర్యకూడా తీసుకోక పోవడం వెనుక ఆంతర్యం ఏమిటో అందరికి ఆర్డమవుతుంది. సదరు నిర్మాణ దారుడి చెంశా ఒకడు కరీమ్.. నగర్ నుండి ఒత్తాసు పలుకుతూ ఒక అధికారిక పత్రికలో ఉన్నానని ఆ భవనం వద్దకు వెళ్లిన వారికీ ఫోన్ చేసి పలకరింపుతో బెదిరింపులకు పాలపడుతున్నట్లు సమాచారం. ఆ తదుపరి అధికారులకు సంప్రదింపులు జరిపి ఎటువంటి పిర్యాదులు వచ్చినా మాకు చెప్పండి అని ఒప్పందం కుదుర్చుకుని వెళ్లినట్లు సమాచారం. పత్రికల్లో రాస్తూ ఉంటారు.. పిర్యాదులు వస్తే చూస్తూ వుంటారు.. అధికారులు మారుతూ ఉంటారు.. డెప్యూటీ కమిషనర్..ఎక్కడ??  అసలు నోడల్ వ్యవస్ట ఉందా..!! లేదా..!! అన్నట్లు ఉంది. మరి జోనల్ కమిషనర్..!!  జోక్యం చేసుకునే దాకా ఇంతేనా...!!  అన్నట్లు ఉంది. ఇప్పటికైనా స్పందిస్తారా లేక వదిలేస్తారా వేచి చూడాలి.