రెవెన్యూ సమస్యలపై జిల్లా పరిషత్ లో నిలదీసిన ఎంపీపీ సద్ది ప్రవీణ విజయ భాస్కర్ రెడ్డి

Published: Thursday August 05, 2021
గుమ్మడిదల, ఆగస్టు 04, ప్రజాపాలన ప్రతినిధి : జడ్పి సమావేశంలో పలు సమస్యలు పరిష్కరించాలని అధికారులు నిలదీసిన ఎంపీపీ సద్ది ప్రవీణ, గుమ్మడిదల గ్రామంలోని 109 సర్వే నెంబర్లు గల ప్రభుత్వ భూమిలో సాగుచేసుకుంటున్న రైతులకు ఎలాంటి రైతుబంధు రైతు బీమా పట్టా పాస్ బుక్ లేకపోవడం, అలాగే అన్నారం గ్రామంలోని సర్వే నెంబర్ 261లో 2021 సంవత్సరంలో 117 మంది రైతులకు ఒకోక్కరకి ఎక్కారం చొప్పున కేటాయించిన వారికి రికార్డులు ఆన్లైన్ లో చేర్చకపోవడంతో పట్టా పాస్ బుక్ లేక, రైతుబందు లేదు, అదేవిధంగా నాగిరెడ్డి గూడెం గ్రామంలోని రైతులకు భూమి పట్టా పాస్ పుస్తకాలు లేక, రైతు బంధు రాక, రైతులు నష్టపోతున్నారని జిల్లా కలెక్టర్ సాక్షిగా రైతులకు న్యాయం జరిగే విధంగా జిల్లా సమావేశంలో గుమ్మడిదల ఎంపీపీ సద్ది ప్రవీణ విజయ భాస్కర్ రెడ్డి అధికారులను నిలదీశారు. త్వరలో రైతులకు న్యాయం జరిగే విధంగా కార్యాచరణ చేపట్టి పట్టా పాస్ పుస్తకాలు వారికి ఉన్న స్థానంలో పొజిషన్ లను చూపించి రైతు బంధు రైతు బీమా వారి ఖాతాలో జమ అయ్యే విధంగా చూడాలని ఆమె కోరారు. ఈ మూడు గ్రామాలలో రైతులు ఎవరైనా అకస్మాత్తుగా చనిపోతే రైతు బీమా అందక కుటుంబం రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని అలాగే పట్టాదార్ పాస్ పుస్తకాలు లేక చనిపోయిన రైతులకు కూడా రైతు బీమా అందే విధంగా చూడాలని ఆమె కోరారు. సమస్యాత్మకం ఉన్నా ఈ మూడు గ్రామాలలో రైతులకు భూ సర్వే చేసి వారి భూమిని చూపించి మిగిలిన భూమిని ప్రకృతి వనాలు కోసం, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, వసతి గృహాలు, ఏర్పాటు కోసం  కేటాయించి మండల అభివృద్ధికి సహకరించాలని ఎంపీపీ కోరారు