ఘనంగా బండారు వెంకట్ రావు జన్మదిన వేడుకలు

Published: Saturday October 02, 2021
మేడిపల్లి, అక్టోబర్ 1 (ప్రజాపాలన ప్రతినిధి) : రామంతాపూర్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు బండారు వెంకట్ రావు జన్మదిన వేడుకలను బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. వెంకట్రావు జన్మదినాన్ని పురస్కరించుకుని  కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని వారి కార్యాలయంలో కేకు కట్ చేయించి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మేడ్చల్ మల్కాజిగిరి డిస్ట్రిక్ట్ గీత సెల్ కన్వీనర్ తాళ్ల బాల కృష్ణ గౌడ్, బిజెపి సీనియర్ నాయకులు వేముల వెంకట్ రెడ్డి, రామంతపూర్ డివిజన్ ప్రధాన కార్యదర్శులు సంకూరీ కుమారస్వామి, ఉలు గొండ  నారాయణదాసు, నరసింహారెడ్డి, పోరెడ్డి మహేశ్వర్ రెడ్డి, శైలేందర్, వేముల తిరుపతయ్య, బద్రీనాథ్, పాడిగం నగేష్, తమ్మలి రవి, కందగట్ల దయానంద్ రెడ్డి, పరశురాం, ప్రభాకర్ రెడ్డి, జాకరియ, దత్త బాలురే, జట్ట సాయి ధీరజ్, ఈ ప్రభాకర్, పాల్గొన్నారు.