రెడ్డిలకే పరిపాలించే సామర్థ్యం ఉందన్న రేవంత్ వ్యాఖ్యలు అర్థరహితం...

Published: Tuesday May 31, 2022
ఉమ్మడి రాష్ట్రంలో  ముఖ్యమంత్రులు పదిమంది రాయలసీమ రెడ్డి లే మరి జరిగిన అభివృద్ధి ఏది???..: డాక్టర్ వినయ్ కుమార్.
 
హైదరాబాద్ (ప్రజాపాలన ప్రతినిధి ):
 
రెడ్డిలకే పరిపాలించే సామర్థ్యం ఉందన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అర్థరహితం అన్నారు డాక్టర్ వినయ్ కుమార్. ఈ సందర్బంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ గతంలో ఉమ్మడి రాష్ట్రంలో 16 మంది ముఖ్యమంత్రులకు గాను పది మంది రెడ్డి లేనని ఐనా రాష్ట్రం ఎక్కడ అభివృద్ధి చెందిందన్నారు. కాంగ్రెస్ లోని గత ముఖ్యమంత్రులు ఒక్క వై ఎస్ ఆర్ మినహాయిస్తే అందరూ సీల్డ్ కవర్ ముఖ్యమంత్రులే అన్నారు.వారిలో 80శాతం రాయలసీమ వారేనని, హైదరాబాద్ లో వారి ఆస్తులు పెంచుకోవడానికి, కాపాడుకోవడానికి తప్ప కనీసం రాయలసీమ కు కూడా చేసిందేమి లేదన్నారు. ఈ రెడ్డి ముఖ్యమంత్రుల వల్ల బలహీన వర్గాల వారికి ఎటువంటి న్యాయం జరగలేదన్నారు.తాను పాలించడానికి, తన రెడ్డి సామాజిక వర్గం పాలించడానికే రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రాయలసీమ రెడ్లు ముఖ్యమంత్రులుగా ఉన్నారని, బడుగు, బలహీన వర్గాలు, బీసీ, ఎస్ సి, ఎస్ టి, మైనార్టీ ల వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా బీసీలకు ప్రాముఖ్యత ఇవ్వలేదన్నారు. హుజురాబాద్ లో బీసీ నే గెలిచాడ న్నారు. గ్రామాల్లో అధిక శాతం భూ ఆక్రమణల కేసులు వారి సామాజిక వర్గాలపైనే అన్నారు.త్వరలో బలహీన వర్గాల కొరకు పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం లో ఆయన తో పాటు పలువురు బీసీ నాయకులు పాల్గొన్నారు.