సోనియా గాంధీని విచారణ పేరిట ఇబ్బందలకు గురిచేస్తున్నారు ఏఐసిసి రీసెర్చ్ డిపార్ట్మెంట్ రాష్

Published: Wednesday July 27, 2022
జన్నారం, జూలై 26, ప్రజాపాలన: నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీని విచారణ పేరిట ఇబ్బందలకు గురిచేస్తున్న ఈడీ చర్యలకి నిరసనగా మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో పోస్ట్ ఆఫీస్ ఎదురుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జ్ లు ధరించి మంగళవారం నిరసన చేపట్టారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఏఐసీసీ రీసెర్చ్ డిపార్ట్మెంట్ రాష్ట్ర కోఆర్డినేటర్ వినోద్ నాయక్ మాట్లాడుతూ పెరుగుతున్న గ్యాస్ ధరలు, పడిపోతున్న రూపాయి విలువ, దేశంలో నిరుద్యోగ సమస్య పక్కన పట్టించేందుకే గాంధీ కుటుంబంని కేసుల పేరిట వేదిస్తున్నారని విమర్శించారు.  మనీ లాండరింగ్ జరగని వ్యవహారంలో ఈడీ ఎలా విచారణ చేస్తదో మోడీ అమిత్ షా సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు. అదికారంలో వున్న కేంద్ర ప్రభుత్వం మోడీ ఈడీ ఎన్ని కుట్రలు చేసిన గాంధీ కుటుంబాన్ని ఏమి చేయలేరని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఒటర్లు ప్రజల నుండి అదారణ పొంది రాబోయే రెండు వేల ఇరువైనాలుగు సంవత్సరముంలో ఎన్నికలలో  పార్టీని అధికారంలోకి తీసుకోస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బోర్లకుంట ప్రభుదాస్, జిల్లా ప్రధాన కార్యదర్శులు మోహన్ రెడ్డి, ముత్యం రాజన్న, ఎంపీటీసీ దాముక కరుణాకర్, మాజీ సర్పంచ్ నందు నాయక్, అజర్, లక్ష్మణ్, దేవయ్య, లకావత్ తిరుపతి, యువజన కాంగ్రెస్ నాయకులు వంగపల్లి నరేష్, మంద రాజేష్, రోహిదాస్, దుమాల్ల రమేష్, బచ్చల శివ, అజయ్ తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area