రాజ్యాంగం కల్పించిన హక్కులను అధికారులు హరిస్తున్నారు. - ఏపీఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుల

Published: Tuesday October 04, 2022
చేవెళ్ల అక్టోబర్ 03 (ప్రజా పాలన)
                                          
రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం గూడూరు గ్రామానికి చెందిన ఎస్సీలకు కులం సర్టిఫికెట్లు అందజేయాలని అంబేద్కర్ ప్రజా సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మైలారం సుబ్రహ్మణ్యం ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ను కోరారు. ఈ మేరకు సోమవారం గ్రామస్తులతో కలిసి ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా తాసిల్దార్ కార్యాలయం నుండి తమకు కులం సర్టిఫికెట్ ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పై చదువులు చదవడానికి అవకాశం లేకుండా పోయిందని అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను స్థానిక అధికారులు హరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై పలుమార్లు రెవిన్యూ శాఖ అధికారులకు విన్నవించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందన్నారు. తరతరాలుగా ఆర్థికంగా వెనుకబడిన తమకు కులం సర్టిఫికెట్ ఇవ్వని కారణంగా మరింత ఆర్థిక సంక్షేమంలోకి కూరుకుపోతున్నామని అన్నారు. ప్రభుత్వ పథకాలు కూడా అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో ఏవిధంగా జీవనం సాగించాలని ప్రశ్నించారు. కావున వెంటనే తమకు కులం సర్టిఫికెట్లు అందజేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేకు అందజేసిన వినతిపత్రంలో కోరారు. లేనిపక్షంలో ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మీసాల ప్రభాకర్, మైలారం కృష్ణ, కే.లక్ష్మయ్య, ఎంసీ అశోక్ ఎం చంద్రయ్య, ఎం బాలయ్య, కె రామచంద్ర, మీసాల రాజు, బి బాలయ్య, బ్యాగరి అశోక్, ఎం యాదయ్య, ఎం జె ప్రవీణ్, మైలారం రవీందర్, ఎం ప్రేమ్ కుమార్, ఎం పద్మారావు, మందగళ్ళ కుమార్, ఎం ఈశ్వరయ్య, కె రమేష్, మీసాల రాములు తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area