సమగ్ర శిక్షలో కోఆర్డినేటర్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం

Published: Tuesday December 13, 2022
జిల్లా విద్యాధికారిణి రేణుకా దేవి
వికారాబాద్ బ్యూరో 12 డిసెంబర్ ప్రజా పాలన : రాష్ట్ర, జిల్లా సమగ్ర శిక్షలో కోఆర్డినేటర్ల పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాధికారిణి జి. రేణుకాదేవి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలలో పనిచేస్తున్న,గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు ఈ పోస్టులకు అర్హులన్నారు. రాష్ట్ర సమగ్ర శిక్షణలోని కోఆర్డినేటర్ల పోస్టులకు 5 సం.రాల సర్వీస్ ఉన్న గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జిల్లా సమగ్ర శిక్షణలో కోఆర్డినేటర్ల భర్తకి గెజిటెడ్ హెచ్.ఎం.లు, 5సం||రాల సర్వస్ స్కూల్ అసిస్టెంటు లు మాత్రమే దరఖాస్తు చేసు కోవాలన్నారు. విధివిధానాలకు లోబడి కనీసం 3 సం॥ రాలు ఫారిన్ సర్వీస్ డిప్యుటేషన్ పై విధులు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ఆన్లైన్ టెస్ట్ ద్వారా ఎంపిక ఉంటుందని, అర్హతలు, విధివిధానాలు ఇతర పూర్తి వివరాలకు www.Samagrashiksha.telangana.gov.in వెబ్సైట్ను సందర్శించాలని తెలిపారు. పై వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తుచేసుకోడానికి తేది 10.12.22 నుండి ప్రక్రియ ప్రారంభమైనదని దరఖాస్తు చేయడానికి *చివరి తేది* 17.12. 2022 అని తెలిపారు. రాష్ట్ర, జిల్లా సమగ్ర శిక్షణలో క్వాలిటీ కోఆర్డినేటర్, ప్లానింగ్ కోఆర్డినేటర్, జండర్ కో ఆర్డినేటర్, సమ్మిళితా విద్యా కో ఆర్డినేటర్. వోకేషనల్ కోఆర్డినేటర్, అసిస్టెంట్ స్టాటిస్టికల్ కోఆర్డినేటర్ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోనాలన్నారు.