ఈ నెల 23 న మంచిర్యాలలో రైతు గర్జన సభ

Published: Saturday March 20, 2021

పిడిఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి జగ జంపుల తిరుపతి
ఆసిఫాబాద్ జిల్లా మార్చి19 (ప్రజాపాలన, ప్రతినిధి) : ఈనెల 23 వ తేదీన మంచిర్యాల్ జిల్లా కేంద్రంలో నిర్వహించే" రైతు గర్జన సభను" విజయవంతం చేయాలని పి డి ఎస్ యు, న్యూ డెమోక్రసీ డివిజన్ నాయకుడు జగ జంపుల తిరుపతి కోరారు. శుక్రవారం ఆసిఫాబాద్ పట్టణంలోని జన్కాపూర్ లో గల సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ కార్యాలయంలో "రైతు గర్జన సభ "కు సంబంధించిన పోస్టర్లను పిడిఎస్యు ఆధ్వర్యంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా పిడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి జగ జంపుల తిరుపతి మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక 3 చట్టాలను, విద్యుత్ సవరణ బిల్లు 2020 రద్దు చేయాలని, ప్రభుత్వరంగ పరిశ్రమల అమ్మకాలను ఆపాలని, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికులకు, నెలకు 24 వేల కనీస వేతనం నిర్ణయించాలని, మంచిర్యాల్, కేబి ఆసిఫాబాద్ జిల్లాలకు తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్టు కు 5 వేల కోట్లు కేటాయించాలని అన్నారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలని, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, అర్హులైన అందరికీ డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వాలని, పలు డిమాండ్లపై మంచిర్యాలలో ఈనెల మార్చి 23 న మహా ప్రదర్శన, బహిరంగ సభ ఉంటుంది, ఇట్టి సభ విజయవంతం కై కార్మికులు రైతులు యువకులు విద్యార్థులు మహిళలు అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ పార్టీ పట్టణ నాయకులు బాబా, ఎర్ర సంతోష్, బాపు రావు, షాహిద్, వీరన్న, తదితరులు పాల్గొన్నారు.