జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను పూర్తి చేయాలి ** జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ **

Published: Friday November 04, 2022

ఆసిఫాబాద్ జిల్లా నవంబర్ 3 (ప్రజాపాలన, ప్రతినిధి) : జిల్లాలోని ఆయా శాఖల పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. వారం జిల్లా కేంద్రంలోని సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్లు చాహత్ బాజ్పాయి, రాజేశం లతో కలిసి అభివృద్ధి పనుల పై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల పరిధిలో చేపట్టిన పనులను నిర్ణీత గడువులోగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వసతి గృహాలలో విద్యార్థులకు విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందించాలని, విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులపై ప్రత్యేక ఆర్యవేక్షణ ఉండాలని  అన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్యాయంతో పనిచేసే జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.