15వ వార్డులో ఉషోదయం కార్యక్రమం

Published: Monday November 21, 2022
 వార్డు కౌన్సిలర్ చిట్యాల అనంతరెడ్డి
వికారాబాద్ బ్యూరో 20 నవంబర్ ప్రజాపాలన : 15వ వార్డులోని సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ఉషోదయం ( మార్నింగ్ వాక్ ) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కౌన్సిలర్ చిట్యాల అనంతరెడ్డి అన్నారు. ఆదివారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 15వ వార్డులోని అపరిష్కృత ప్రజా సమస్యలను ఉషోదయం కార్యక్రమంలో భాగంగా ప్రజలను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా 15వ వార్డ్ కౌన్సిలర్ చిట్యాల అనంతరెడ్డి మాట్లాడుతూ ఉదయం 5 గంటల నుండి 11 గంటల వరకు 15వ వార్డుకు సంబంధించిన అన్ని కాలనీలను గల్లీ గల్లీ తిరిగి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నానని తెలిపారు. ప్రతి ఆదివారం ఉదయం ఐదు గంటలకు ఉషోదయం కార్యక్రమం ప్రారంభమవుతుందని వివరించారు.
ఉషోదయం కార్యక్రమంలో భాగంగా ఎల్ఐసి బిల్డింగ్ పక్కన గల* *లాలాగూడ, కార్తికేయ నగర్, కొత్త కలెక్టరేట్ ముందు గల కాలనీలోని ఇంటింటికి వెళ్లి కాలనీ వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ సిబ్బంది డ్రైవర్లు చెత్త సేకరణలో నిర్లక్ష్యం వహించరాదని సూచించారు. మున్సిపల్లో పనిచేసే డ్రైవర్లు ప్రతి ఒక్కరు చెత్త సేకరణ,వార్డు  పరిశుభ్రతలో నిబద్ధతతో పనిచేసి కాలనీ* *వాసులకు సహకరించాలని స్పష్టం చేశారు.  శానిటేషన్ సిబ్బంది ప్రతి ఒక్కరూ వార్డు వార్డులో చెత్తను సేకరించి   వార్డు పరిశుభ్రతకు కృషి చేయాలి అన్నారు. ముఖ్యంగా శానిటేషన్ డ్రైవర్లు ప్రజలతో కలగలుపుగా మాట్లాడుతూ చెత్తను 
సేకరించాలని హితవు పలికారు. ప్రజల నుంచిఎలాంటి ఫిర్యాదులు రాకుండా జాగ్రత్త పడాలని, చెత్త సేకరణలో నిర్లక్ష్యం వహించరాదని సూచించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైప్ లైన్ ఏమన్నా సమస్యలు ఉంటే ఈ ఫోన్ నంబర్ ద్వారా 9440 032 356 కు తెలియజేయాలని 15వ వార్డ్ కౌన్సిలర్ అనంతరెడ్డి తెలిపారు.ళసాకేత్ నగర్,  కమాల్ నగర్ కాలనీలో సీసీ రోడ్డు సమస్యను వికారాబాద్ జిల్లా శాసనసభ్యులు ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ దృష్టికి తీసుకెళ్లి  సిసి రోడ్ సమస్యను త్వరగా పరిష్కరిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు* *కృష్ణ ,నాగయ్య,ఉదయ్ , విట్టల్ రెడ్డి, వెంకటేష్, పాపిరెడ్డి ,జీవన్ కుమార్, బంధయ్య, టీచర్ బుచ్చయ్య, పోలీస్ గోపాల్, మున్సిపల్‌ సిబ్బంది తదితరులు  పాల్గొన్నారు.