జగిత్యాల రూరల్,అర్బన్ మండలాలు అభివృద్ధి చెందాలి - జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత

Published: Wednesday April 07, 2021
జగిత్యాల, ఏప్రిల్ 06 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల జిల్లా పరిషత్ క్యాంప్ కార్యాలయంలో జగిత్యాల రూరల్ మరియు అర్బన్ మండలాల ఎంపీడీఓలతో జిల్లా జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతు కారోన మళ్ళీ విజృంభిస్తున సందర్భంగా ప్రతి గ్రామంలో శానిటేషన్ చేయాలని వేసవి కాలంలో మొక్కలు ఎండిపోకుండ ఉదయం సాయంత్రం రెండు సార్లు నీరు పట్టాలని అన్నారు. గ్రామాల్లో మిగిలిన పనులు వైకుంఠ ధమాలు పల్లెప్రకృతి వనాలు త్వరాగ పూర్తి చేయాలని వసంత కోరారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎంపీడీఓ రాజేశ్వరి అర్బన్ ఇంచార్జి ఎంపీడీఓ గంగాధర్ మరియు ఎంపీవోలు శ్రీనివాస్ రెడ్డి సలీమ్ పాల్గొన్నారు.