వారసత్వ సంస్కృతిని కాపాడుకుందాం

Published: Saturday November 26, 2022
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో 25 నవంబర్ ప్రజా పాలన : ప్రపంచ దేశాలకే నాగరికతను నేర్పిన భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు నేడు పాశ్చాత్య విష సంస్కృతికి బలైపోకుండా మన వారసత్వ సంస్కృతిని కాపాడుకుందాం అని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఫతే గార్డెన్లో కళాభారతి హ్యాండీక్రాఫ్ట్స్ హ్యాండ్లూమ్స్ ఆర్టిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ చేనేత హస్తకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ సంస్కృతిలో అంతర్భాగమైన చేనేతలు హస్తకళలు సమైక్య జీవన సౌందర్యానికి ప్రతీకలని కొనియాడారు. అగ్గిపెట్టెలో పట్టుచీరను మలచిన అద్భుతమైన కళా నైపుణ్యం కలిగిన కళాకారులు ఖండాంతర ఖ్యాతినార్జించారని వివరించారు. అద్భుత కళాఖండాలను తయారుచేసి నాటి ప్రభువుల ఆదరణ ప్రోత్సాహంతో ఎంతో గొప్పగా విరాజిల్లారన్నారు. నేటి నవీన జీవన స్రవంతిలో ప్రభుత్వాల ప్రోత్సాహంతో చేనేత కళాకారులను ఆదరిస్తున్న ఏకైక ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం అని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాభారతి సహాయ కార్యదర్శి శనిగరం కిషోర్ కళాభారతి అధ్యక్షులు జెల్ల సత్యనారాయణ వడ్డేపల్లి రమేష్ హుస్సేన్ వేణుగోపాల్ కృష్ణ పలు రాజకీయ నాయకులు పాల్గొన్నారు.