డాక్టర్ మనోహర్ లోహియా ఆరోగ్య జీవన సమస్త సౌజన్యంతో...* ఔషాపూర్ లో ఆక్యుప్రెషర్ మ్యాగ్నెటిక్ చి

Published: Monday January 30, 2023
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం ఔషపూర్ గ్రామంలో సామూహిక భవనంలో ఆదివారం డాక్టర్ మనోహర్ లోహియా ఆరోగ్య జీవన్ సంస్థాన్ ద్వారా అక్యుప్రెషర్ మ్యాగ్నెటిక్ చికిత్స వైబ్రేషన్ చికిత్స సుజోక్ చికిత్స శిబిరం డాక్టర్ మనోహర్ లోహియా ఆరోగ్య జీవన సమస్త సౌజన్యంతో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర స్థానిక సంస్థల అధ్యక్షుడు రాష్ట్ర ఎంపీపీల పోరం అధ్యక్షులు ఘట్కేసర్ మండల ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, గ్రామ సర్పంచ్ ఏనుగు కావేరి మచ్చేందర్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ గారు మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాలు గ్రామంలో ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరమని ఒక్కసారి వంద రూపాయలతో పేరు నమోదు చేసుకున్న తర్వాత మొత్తం ఏడు రోజులు చికిత్స అందిస్తారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం వరకు చికిత్స చేస్తారు. గ్రామంలో ఉన్న ప్రజలకు మెడనొప్పి, తలనొప్పి, కీళ్ల నొప్పులు, రక్తపోటు, ఎసిడిటీ, మోకాలి నొప్పులు, నడుము నొప్పులు, ఆస్తమా, థైరాయిడ్, చెవి, ముక్కు సమస్యలు ఉన్నవారు ఏలాంటి మందులు లేకుండానే తగ్గుతాయి పేరు నమోదు చేసుకుని చికిత్స చేసుకోవాల్సిందిగా కోరుతున్నామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో వెంకిర్యాల ఎంపీటీసీ బసవయ్య, ఉపసర్పంచ్ ఐలయ్య యాదవ్, వార్డు సభ్యులు మల్లేష్, డి బి రవి నాయక్, శ్రీనివాస్ గౌడ్, నాయకులు మచ్చేందర్ రెడ్డి, బాలకృష్ణ యాదవ్, గ్రామ ప్రజలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.