విద్యుత్ మోటార్లు ధ్వంసం చేసిన గుర్తుతెలియని దుండగులు

Published: Friday December 10, 2021
బోనకల్, డిసెంబర్ 9 ప్రజాపాలన ప్రతినిధి : మండల పరిధిలోని ఆళ్లపాడు గ్రామంలో మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు 3 విద్యుత్ మోటార్లను, డెలివరీ పైపులను, స్టార్టర్ బాక్సులను ధ్వంసం చేయడం జరిగింది. గత సంవత్సరం కూడా ఈ విధంగానే 11 మంది రైతుల విద్యుత్ మోటారు ను కూడా ధ్వంసం చేశారు. సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ తాత్కాలిక ఎంక్వయిరీ చేశారు. ఈ విధంగా ధ్వంసం చేయటం వల్ల రైతులు వాటి మరమ్మతుల కోసం లక్షలు ఖర్చుచేసి మరమ్మతులు చేయించి నప్పటికీ మరలా ఈ సంవత్సరం కూడా మోటార్లు పంటకు నీరు పెట్టే దశలో ధ్వంసం చేయడం వల్ల చేతికి వచ్చిన పంట సైతం చేతి రాకుండా పోతుందని రైతులు వాపోతున్నారు. ధ్వంసం చేసిన మోటార్లు సైతం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావడం చర్చలకు దారి తీస్తుంది. కార్యక్రమంలో కిసాన్ సెల్ మండల అధ్యక్షులు,కలకోట సొసైటీ చైర్మన్ కర్నాటి రామకోటేశ్వరరావు మాట్లాడుతూ తక్షణమే వీటిపై చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను తమ చరవాణి ద్వారా రైతుల యొక్క సమస్యలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ సెల్ మండల అధ్యక్షులు పాపారావు, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు బుంగ రాములు, షేక్ జాన్ బాషా, గౌడ సంఘ అధ్యక్షులు కందుల సత్యం, మరీదు ప్రసాద్, మరీదు వెంకటేశ్వర్లు, మరీదు రాము, మరీదు కిషోర్ తదితరులు పాల్గొన్నారు.