పి హెచ్ డి సబ్మిషన్ కు ఏడాది గడువు పొడిగించాలి -ప్రొఫెసర్ హరగోపాల్

Published: Wednesday January 11, 2023
హైదరాబాద్ (ప్రజాపాలన ప్రతినిధి ):
 
వివిధ కారణాలతో పి హెచ్ డి సబ్మిషన్ కు దూరంగా ఉన్న విద్యార్థులకు మరో ఏడాది గడువు ఇవ్వాలని ప్రొఫెసర్లు హరగోపాల్, ముత్తయ్య లు కోరారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఓయు పీహెచ్ డీ ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో విద్యార్థులది న్యాయమైన డిమాండ్ అని అన్నారు. వీసీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం తో ఎంతోమంది పీహెచ్డీ విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో కి వెళ్ళిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఇలాంటి నిబంధన లేదని విద్యార్థులు వెసులుబాటును బట్టి పీహెచ్ డి సబ్మిషన్ చేసుకునే అవకాశం ఉందని అన్నారు. సుమారు 75% పూర్తి చేసుకున్న విద్యార్థులు వీసీ నిర్ణయం తో వారి భవిష్యత్తు అంధకారంలోకి నెట్టివేయబడుతుందని అన్నారు.  కరోనాకాలంలో ఏడాది కాలం చదువులకు దూరమైన విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని నిబంధనలను ఉపసంహరించుకొని మరో ఏడాది అవకాశం కల్పించి వారి భవిష్యత్తుకు బాటలు వేయాలని ప్రొఫెసర్లు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమం లో పి హెచ్ డి విద్యార్థులు కనకారెడ్డి, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.