డాక్టర్ బాలి ఆధ్వర్యంలో ఐ సి ఎం ఆర్ టీం తరపున వైద్య పరీక్షలు....

Published: Friday January 07, 2022
ఎర్రుపాలెం డిసెంబర్ ప్రజా పాలన ప్రతినిధి: మండలంలోని ఇనగాలి గ్రామంలో డాక్టర్ బాలి ఆధ్వర్యంలో ఐ సి ఎం ఆర్ టీం తరఫున మండలంలోని సబ్ సెంటర్ అయినా ఇనగాలి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి బ్లడ్ శాంపిల్ ను తీసుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో జిల్లా తరఫున ఒక టీం ని ఏర్పాటు చేశామని, ఈ టీం మండలంలోని ఒక గ్రామాన్ని ఎంచుకుని గ్రామంలో ఉన్నటువంటి ప్రజల యొక్క బ్లడ్ శాంపిల్ ని తీసుకుంటున్నామని, కోవిడ్ వచ్చి తగ్గిన వారి శాంపిల్ కూడా తీసుకుంటున్నామని, 20% కంటే తక్కువగా ఉంటే వారికి వ్యాక్సిన్ ఇస్తామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాస్, ల్యాబ్ టెక్నీషియన్ సంపత్, గ్రామ సర్పంచ్ ఎర్రమల వెంకట్ రెడ్డి, సెక్రటరీ రాజ్యలక్ష్మి, బనిగండ్లపాడు పీహెచ్సీ వైద్యులు డాక్టర్ రాజు, డాక్టర్ సుధాకర్, సూపర్ వైజర్ కోట వెంకటేశ్వరరావు, హెల్త్ అసిస్టెంట్ కొత్తపల్లి సుధాకర్, ఏ ఎన్ ఎం భవాని, ఆశా వర్కర్లు నాగమణి, అనసూర్య తదితరులు పాల్గొన్నారు.