రజకుల అభివృద్ధే లక్ష్యంగా కృషి

Published: Monday March 01, 2021

తెలంగాణ రజక సంఘం జెఏసి చైర్మన్ పంజగారి ఆంజనేయులు
వికారాబాద్ జిల్లా ఫిబ్రవరి 28 ( ప్రజాపాలన ప్రతినిధి ) : రజకుల అభివృద్ధే లక్ష్యంగా కృషి చేస్తామని తెలంగాణ రజక సంఘం జెఏసి చైర్మన్ పంజగారి ఆంజనేయులు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సత్యభారతి వేడుక వేదికలో జిల్లా రజక సంఘం జెఏసి అధ్యక్షుడు పెద్దలాల్ రాములు అధ్యక్షతన కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇప్పటి వరకు రజకులకు ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయలేదని విమర్శించారు. ఎంపి, ఎమ్మెల్యేల ద్వారా కార్యక్రమాలు నిర్వహించి నిధులు రాబట్టుకోవాలని సూచించారు. జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కమ్యూనిటి హాల్ కొరకై స్థలం, భవన నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి మండల హెడ్ క్వార్టర్స్ లో మండల కమ్యూనిటిహల్, అధునాతన ధోబీఘాట్ల నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. జి ఓ నెంబర్ 571 నుండి ధోభీఘాట్, కమ్యూనిటి హాల్ స్థలం సడలింపు చేసి ఎంఆర్ఒ, కలెక్టర్ ద్వారా మంజూరైన సర్టిఫికెట్, స్థలాన్ని రెవిన్యూ రికార్డులో నమోదు చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ రజక సంఘాల కో కన్వీనర్ మానస గణేష్, తెలంగాణ రజక సంఘాల జేఏసీ ప్రదాన కార్యదర్శి చిన్న లాల్ మల్లికార్జున, రాష్ట్ర రజక సంఘాల వైస్ ప్రెసిడెంట్ లక్ష్మయ్య, వికారాబాద్ జిల్లా రజక సంఘాల జేఏసీ కార్యవర్గం ముఖ్య నాయకులు,  నియోజకవర్గ అధ్యక్షులు, జిల్లాలో గల మండల అధ్యక్షులు, మండల పరిధిలో గల గ్రామాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు రజక సంఘం ప్రజా ప్రతినిధులు, ఎంపిటిసిలు, మాజీ ఎంపిటిసిలు, సర్పంచులు, మాజీ సర్పంచులు, వార్డ్ మెంబర్ లు, మాజీ వార్డ్ మెంబెర్ లు, రజక మహిళ నాయకురాళ్లు, విద్యార్థులు, కార్మికులు, వృత్తిదారులు పాల్గొన్నారు.