మోడీ విధానాల వలన దేశం కు శ్రీలంక పరిస్థితి దాపురిస్తాయి. సీపీఐ రాష్ట్ర సహయ కార్యదర్శి, మాజీ ఎ

Published: Wednesday August 03, 2022
పాలేరు ఆగస్టు 2 ప్రజాపాలన ప్రతినిధి
నేలకొండపల్లి
దేశంలో మోడీ విధానాల వలన భారతదేశం కు శ్రీలంక పరిస్థితులు
దాపురించే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర సిపిఐ సహాయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే పూనమనేని సాంబశివరావు, ఆరోపించారు. నేలకొండపల్లి మండలంలోని సదాశివాపురం లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ సంపద ను అంబాని. ఆదాని లకు దోచిపెడుతున్నాడని ఆరోపించారు. దేశంలో 500 పబ్లిక్ సెక్టార్లను అమ్మకానికి పెట్టారని విమర్శించారు. రాజ్యంగ సంస్థలను గుప్పిట్లో పెట్టుకుని మోడీ నిరంకుశ పాలన సాగిస్తున్నారని అన్నారు. లక్షల కోట్లు అప్పులు చేస్తున్నాడని పేర్కొన్నారు. డబుల్ ఇంజన్ కాదు.... డబుల్ ప్రమాదం అన్నారు. అజాద్ అమృతోత్సవం పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. ఆదాని ని ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థాయి కి తీసుకరావాలని దేశ సంపద ను అప్పనంగా కట్టబెడుతున్నాడని అన్నారు. కేంద్రం లో మోడీ. రాష్ట్రంలో కేసీఆర్ లకు ఏ మాత్రం తేడా లేదని ఇద్దరు...ఇద్దరే అన్నారు. ప్రజలకు ఇచ్చిన హమీల కొట్టుకపోవటం ఖాయమని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి దివాళా తీయిస్తున్నారని అన్నారు. జీతాలు ఇచ్చే పరిస్థితి లో ప్రభుత్వం ఎందుకు ఉందో కేసీఆర్ సమాధానం చెప్పాలని అన్నారు. ఆర్థిక పరిస్థితులు పై శ్వేత పత్రం ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కొద్దిమంది చేతిలో
డబ్బులు ఉండటం వలన జీడిపీ పడిపోతుందని అన్నారు. ఈ విలేకర్ల సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, నాయకులు మౌలానా, కర్నాటి బానుప్రసాద్. సిద్ధినేని కర్ణకుమార్, మారిశెట్టి వెంకటేశ్వరరావు, పాల్తీయ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన మహాసభలో పాల్గొని ప్రసంగించారు.