ఏఐఎస్ఎఫ్ నూతన క్యాలెండర్ ఆవిష్కరించిన ఎస్సై దేశ్ చంద్రశేఖర్ శంకరపట్నం జనవరి 30 ప్రజాపాలన రి

Published: Tuesday January 31, 2023

భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో 2023వ సంవత్సర రూపొందించిన నూతన క్యాలెండర్ను సోమవారము శంకరపట్నం మండల పోలీసుస్టేషన్ లో ఎస్సై దేశ్ చంద్రశేఖర్, ఏఎస్సైఐ మల్లారెడ్డి, సుధాకర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్సై దేశ్ చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ.. విద్యార్థి ఉద్యమాలతో పాటు సామాజిక బాధ్యతతో ఏఐఎస్ఎఫ్ క్యాలెండర్ రూపొందించడం శుభపరిణామమని హర్షం వ్యక్తం చేశారు. ప్రతీ విద్యార్థి చదువుతూ, సమాజానికి ఉపయోగపడే సామాజిక కార్యక్ర మాలు రూపొందించుకొని ముందుకు సాగాల న్నారు. పేద విద్యార్థులకు ఉపయోగపడే ఏ మంచి కార్యక్రమానికై పోలీసు శాఖ సహకారం ఉంటుందని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు కనకం సాగర్, ఆకాష్, కర్ణకర్ తదితరులు పాల్గొన్నారు.