నాగరాజు హత్య నిందితులను ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా, విచారణ జరిపించి వెంటనే ఉరితీయాలి

Published: Monday May 09, 2022
మాదిగ హక్కుల దండోరా జిల్లా అధ్యక్షులు చిలుక రాజనర్సు డిమాండ్
బెల్లంపల్లి మే 8 ప్రజాపాలన ప్రతినిధి:  కులాంతర వివాహం చేసుకున్న దళితుడైన నాగరాజును అత్యంత కిరాతకంగా హత్య చేసిన నిందితులను, పట్టుకొని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపించి వెంటనే ఉరి తీయాలని మాదిగ హక్కుల దండోరా జిల్లా అధ్యక్షులు చిలుక రాజనర్సు ఆదివారం డిమాండ్ చేశారు. నాగరాజు హత్యను నిరసిస్తూ స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి శ్రద్ధాంజలి ఘటించారు, అనంతరం వారు మాట్లాడుతూ భారతదేశంలో పరువు హత్యల పరంపర కొనసాగుతుందనీ,  కులాంతర వివాహం చేసుకున్నాడని హత్య చేయటం అత్యంత కిరాతకమైన చర్యగా  భావిస్తున్నామని అన్నారు, కులాంతర వివాహాలను ప్రోత్సహించాల్సిన కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు మెతక వైఖరి అవలంబించడం వల్లనే ఇలాంటి పరువు హత్యలు జరుగుతున్నాయని, ఇప్పటికైనా కులాంతర వివాహాలు చేసుకున్న వారికి లైసెన్సు ఆయుధాలను కల్పించి, వారికి రక్షణగా కల్పించాలని, ఆయన డిమాండ్ చేశారు.
నాగరాజు హత్య నిందితులను వెంటనే పట్టుకొని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ చేపట్టి దోషులను ఉరి తీయాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో  చిలుక రాజనర్సు కోళ్ల రమేష్, ఆకునూరి రాజకుమార్, ఇడిగిరాల ప్రసాద్, అంబాల రాజ్ కుమార్ కంపల్లి నాగరాజు, కం పెళ్లి సతీష్, తోటపల్లి శ్రావన్ కుమార్, చొప్పదండి శ్రీనివాస్, లక్ష్మణ్, శంకర్, కడపాక రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు