పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి : సి పి ఎం ఆధ్వర్యంలో ధర్నా

Published: Tuesday October 12, 2021
బెల్లంపల్లి, అక్టోబర్ 11, ప్రజాపాలన ప్రతినిధి : పోడు భూములను సాగు చేసుకుంటున్న పేద ప్రజలకు, ఆదివాసీలకు, వెంటనే హక్కు పత్రాలను అందించాలని  సిపిఎం పార్టీ జిల్లా అధ్యక్షుడు సంకె రవి అన్నారు. సోమవారం నాడు బెల్లంపల్లి ఆర్డిఓ కార్యాలయం ముందు పోడు భూములకు హక్కు పత్రాలు అందించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి కార్యాలయ ఇంచార్జ్ దిలీప్ కుమార్ కు మెమోరాండం అందించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మంచిర్యాల జిల్లాలోని పలు మండలాల్లో తాత, ముత్తాతల నుండి వారసత్వంగా సాగుచేసుకుంటున్న పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వకుండా ఫారెస్ట్ అధికారులు, ప్రభుత్వ అధికారులు, బిజెపి, టిఆర్ఎస్, పార్టీల నాయకులు అందరూ కలిసి పేద ప్రజల భూములను లాక్కుంటు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఇప్పటికైనా పోడు భూములను సాగు చేసుకుంటున్న వారికి హక్కు పత్రాలు అందజేయాలని వారి వేధింపులు మానుకొని ప్రభుత్వ నిబంధనల మేరకు సాగు చేసుకుంటున్న వారందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంకే రవి, జిల్లా కార్యదర్శి, ఎ.రమణ, చల్లురి దేవదాసు బెల్లంపల్లి మండల నాయకులు, జంబి బాపు, నెన్నేల మండల నాయకులు, రాజన్న, పోశం, భిమేష్, శేఖర్, రైతులు, తదితరులు, పాల్గొన్నారు.